RangDe - కీర్తిసురేష్ బర్త్ డే స్పెషల్

Saturday,October 17,2020 - 12:02 by Z_CLU

ఈరోజు కీర్తిసురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా RangDe మూవీ నుంచి ఆమెకు సంబంధించి మరో స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విశెష్ చెప్పారు.

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యే తిరిగి స్టార్ట్ చేశారు. అంతేకాదు.. ఈనెలాఖరకు పాటల షూటింగ్ కోసం ఇటలీ కూడా వెళ్లబోతున్నారు. దీంతో మూవీ షూట్ మొత్తం పూర్తవుతుంది.

సంక్రాంతి కానుకగా రంగ్ దేను రిలీజ్ చేస్తామని మరోసారి ప్రకటించారు మేకర్స్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో Nithin-KeerthySuresh (నితిన్-కీర్తిసురేష్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు

Also Check – RangDe Movie Stills