మిస్ ఇండియాగా మారిన మహానటి

Monday,August 26,2019 - 04:32 by Z_CLU

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన కీర్తిసురేష్ ఇప్పుడు మిస్ ఇండియాగా మారింది. అవును… ఆమె కొత్త సినిమాకు మిస్ ఇండియా అనే పేరు పెట్టారు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిస్ ఇండియా అనే టైటిల్ పెట్టడం అందర్నీ కాస్త షాక్ కు గురిచేసింది.

ఈ విషయం పక్కనపెడితే.. టీజర్ లో స్లిమ్ లుక్ తో అదరగొట్టింది కీర్తిసురేష్. మొన్నటివరకు కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ, మిస్ ఇండియా మూవీ కోసం స్లిమ్ గా మారింది. ఈ లుక్ తో ఇప్పటికే మన్మథుడు-2 సినిమాలో ఆమె కనిపించినప్పటికీ అది గెస్ట్ రోల్ మాత్రమే. కీర్తిసురేష్ నయా లుక్ తో వస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ మిస్ ఇండియా.

ఈ సినిమాతో నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈస్ట్-కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.