కీర్తి సురేష్ – ఉన్న నిజం ఇదే...

Wednesday,June 12,2019 - 01:15 by Z_CLU

‘నేను శైలజ’ సినిమాతో పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తరవాత నేనులోకల్, అజ్ఞాత వాసి… ఆ నెక్స్ట్ ఏడాది ‘మహానటి’.. ఈ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే ఇప్పటి దాకా చేసిన సినిమాలివే. కానీ నిజానికి కీర్తి సురేష్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 20 సినిమాలు కంప్లీట్ చేసుకుంది. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.

అందుకే 20 వ సినిమాని ప్లాన్డ్ గా ఎంచుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఈ స్పేస్ లో ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఉండేలా చూసుకుంది. ఈ సినిమా మ్యాగ్జిమం షూటింగ్ స్పెయిన్ లో షూటింగ్ జరుపుకోనుంది.

ఫీమేల్ సెంట్రిక్ అనగానే ఇదేదో హారర్ సినిమానో, థ్రిల్లర్ సినిమానో కాదు… అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతెందుకు ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీర్తి సురేష్ కి తాతగా నటిస్తున్నాడు. నదియా, నరేష్ పేరెంట్స్ గా కనిపించబోతున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ మెహరా కీర్తి అన్నా, చెల్లెళ్ళు గా కనిపించబోతున్నారు. వీరందరి మధ్య పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది కీర్తి సురేష్.

ఈ సినిమా కోసం కష్టపడి మరీ బరువు తగ్గింది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కథాంశం ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, కీర్తి సురేష్ మాత్రం తన మైల్ స్టోన్ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న అంచనాలను 100% అందుకుంటానని కాన్ఫిడెంట్ గా ఉంది.