ఎన్టీఆర్ బయోపిక్ లో రీమిక్స్ లు ఉండవు

Saturday,January 05,2019 - 02:01 by Z_CLU

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ఎలాంటి రీమిక్స్ ఉండవని క్లారిటీ ఇచ్చాడు మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ను యాజ్ ఇటీజ్ గా అలానే వాడామని, ఆ ట్యూన్స్ ను రీ-ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం రాలేదన్నారు.

“రీమిక్స్‌ ఏమీ చేయలేదు. పాటల నేపథ్యంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అవగాహన కోసం దర్శకుడు లొకేషన్‌కి తీసుకెళ్లి చూపించారు. ఆ పాటలు యథాతథంగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటూనే నేటి తరానికి కావల్సినట్టుగా వినిపిస్తుంది.”

మరోవైపు ఇది తనకు మొదటి బయోపిక్ కాదంటున్నాడు కీరవాణి. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలు కూడా దాదాపు బయోపిక్సే అంటున్నాడు.

“అన్నమయ్య, శ్రీరామదాసు కథలు కూడా కల్పితం కాదు కదా. నా దృష్టిలో అవీ బయోపిక్‌లే. సమకాలీన వ్యక్తుల జీవితాలకు సంబంధించి నా తొలి బయోపిక్‌ ఇదే అని చెప్పాలి. బయోపిక్‌లు చేసేటప్పుడు సత్యానికి దూరంగా వెళ్లకూడదు. సిన్సియారిటీ లేనివాళ్లు బయోపిక్‌లకి పనిచేయలేరు. ఎన్టీఆర్‌ అభిమానిని కాబట్టే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా.”

గతంలో కూడా తనకు కొన్ని బయోపిక్ ఆఫర్లు వచ్చినప్పటికీ సంఘటనల్లో మార్పుచేర్పులు చేయడం వల్ల వాటిని యాక్సెప్ట్ చేయలేదంటున్నారు కీరవాణి.