రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న కీరవాణి

Monday,March 27,2017 - 10:31 by Z_CLU

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటానని దాదాపు మూడేళ్ల కిందటే ప్రకటించారు సంగీత దర్శకుడు కీరవాణి. కానీ అప్పటి తన మాటను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొన్నాళ్లు కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు కీరవాణి తెలిపారు.

బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కొన్ని గంటల ముందు ట్విట్టర్ లో స్పందించారు కీరవాణి. సినిమాల నుంచి తప్పుకుంటానంటూ కొన్నేళ్ల కిందట చేసిన ప్రకటనను తనకుతానుగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా చాాలా అంశాలపై స్పందించిన కీరవాణి, తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించారు.

తను ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా కీరవాణి క్లారిటీ ఇచ్చారు. చాలా సినిమాలకు కేవలం డబ్బు కోసమే పనిచేశానని.. ఈసారి మాత్రం తన మనసుకు నచ్చినట్టు మాత్రమే పనిచేస్తానని తెలిపారు. తన పాటల్ని వేరే వ్యక్తులు (దర్శకుడు లేదా నిర్మాత) జడ్జ్ చేయడం తనకు ఇష్టంలేదని తెలిపిన కీరవాణి.. తన మైండ్ సెట్ కు సెట్ అయ్యే వ్యక్తులతోనే వర్క్ చేస్తానని ప్రకటించారు.