సవ్యసాచి సినిమాకు కీరవాణి సంగీతం?

Monday,October 02,2017 - 03:38 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య సవ్యసాచి సినిమాకు కీరవాణి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయం త్వరలోనే పక్కా అయ్యే అవకాశాలున్నాయి. బాహుబలి-2 తర్వాత కీరవాణి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అటు నాగచైతన్య-కీరవాణి కాంబోలో కూడా ఇదే ఫస్ట్ మూవీ.

లెక్కప్రకారం గత నెల 20నే సవ్యసాచి ప్రారంభం కావాలి. కానీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగచైతన్య.. సినిమాను వాయిదావేశాడు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈనెల 14 నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ను ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.

కీరవాణి-నాగార్జునది సూపర్ హిట్ కాంబినేషన్. డివోషనల్ అయినా, కమర్షియల్ సినిమా అయినా.. ఇలా జానర్ ఏదైనా నాగ్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఇచ్చాడంటే సినిమా హిట్టే. ఇప్పుడు నాగచైతన్య-కీరవాణి కాంబోలో కూడా అదే మేజిక్ రిపీట్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.