'కౌసల్య కృష్ణమూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,August 17,2019 - 02:11 by Z_CLU

ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కౌసల్య కృష్ణమూర్తి. కేఎస్. రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రమిది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్‌ నటించాడు. ఇందులో మెయిన్ లీడ్ పోషించిన ఐశ్వర్య రాజేష్ నిజానికి తెలుగమ్మాయే. కానీ తమిళ్ లో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఈ అమ్మాయి సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ మనవరాలు. అలాగే నటుడు రాజేష్‌ కుమార్తె.

రీమేక్‌ సినిమా అయినప్పటికీ ఒక స్ట్రయిట్ సినిమా కంటే ఎక్కువ ఎఫెర్ట్‌ పెట్టి చేశామంటున్నాడు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. రేపు ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు.

నటీనటులు
ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు
టెక్నీషియన్స్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: దిబు నినన్
కథ: అరుణ్‌రాజ కామరాజ్
మాటలు: హనుమాన్‌ చౌదరి
పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల,
ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌
డాన్స్‌: శేఖర్‌, భాను
సమర్పణ: కె.ఎస్‌.రామారావు
నిర్మాత: కె.ఎ.వల్లభ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు