90ml పూర్తిచేసిన కార్తికేయ
Wednesday,November 06,2019 - 12:37 by Z_CLU
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న కొత్త సినిమా 90ml. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.
సినిమాకు సంబంధించి తాజాగా అజర్ బైజాన్ లో ఓ భారీ షెడ్యూల్ జరిగింది. 8 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో 3 పాటలు పిక్చరైజ్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.
కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ హ్యాపీ మూడ్ లో ఉంది.

నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ ,పోసాని కృష్ణ మురళి, అజయ్ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్,
కెమెరా: జె.యువరాజ్,
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్,
ఆర్ట్: జీఎం శేఖర్,
పాటలు: చంద్రబోస్,
ఫైట్స్: వెంకట్, జాషువా,
ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ,
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ,
రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర