నిర్మాతగా కత్రినాకైఫ్

Tuesday,May 28,2019 - 02:01 by Z_CLU

హీరోయిన్స్ నిర్మాత‌లుగా మారుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో అనుష్క శ‌ర్మ‌, దీపికా ప‌దుకొనె వంటి స్టార్ హీరోయిన్స్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న‌వారే. ఇప్పుడు ఈ లిస్టులో క‌త్రినా కైఫ్ కూడా చేరనుంది. ఫ్రెంచ్ చిత్రం `హీ ల‌వ్స్ మీ – హీ ల‌వ్స్ మీ నాట్‌` సినిమాను రీమేక్ చేయ‌డానికి క‌త్రినా కైఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

`ప్రాజెక్ట్ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. దాంతో హ‌క్కుల‌ను తీసుకున్నాం. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ ఏడాదినే సినిమాను సెట్స్‌కు తీసుకెళ‌తాం` అంటూ ప్రకటించింది క‌త్రిన. భారత్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కత్రిన. ఇలాంటి టైమ్ లో నిర్మాణం వైపు ఆమె దృష్టిపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలోనే ఆ రీమేక్ డీటెయిల్స్ బయటకు వస్తాయి.