కాటమరాయుడు వీక్లీ రిపోర్ట్

Saturday,April 01,2017 - 01:08 by Z_CLU

పవర్ స్టార్ కాటమరాయుడు సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది.ఇప్పటికీ రిలీజైన ప్రతి సెంటర్ లోను అంతే స్ట్రెంత్ తో ప్రదర్శించబడుతున్న కాటమరాయుడు ఇప్పటికే 54 కోట్లు కలెక్ట్ చేసేసింది. అందులో 45 ఓట్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే వసూలు కావడం విశేషం.

నైజాం లో 13 .10 కోట్లు వసూలు చేసిన కాటమరాయుడు, సీడెడ్ లో 7.16 కోట్లు, ఆంధ్రా లో ఏకంగా 24. 3 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఒక్క US లోనే ఈ సినిమా వసూలు చేసిన మొత్తం గ్రాస్ $ 1, 095, 424.  ఇదీ కాటమరాయుడు ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం.

కిశోర్ కుమార్ పార్ధసాని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జస్ట్ ఫస్ట్ వీక్ మాత్రమే కాదు సెకండ్ వీక్ కూడా అదే ఏ మాత్రం స్పీడ్ తగ్గే చాన్సెస్ లేవని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిం మేకర్స్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించాడు.