కాటమరాయుడు ట్రయిలర్ రివ్యూ

Sunday,March 19,2017 - 11:49 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా కాటమరాయుడు. ఈ సినిమా విడుదలకు అఫీషియల్ కౌంట్ డౌన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో అట్టహాసంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కాటమరాయుడు ట్రయిలర్ లాంచ్ చేశారు. పవన్ ను మాస్ హీరోగా చూపిస్తూ తెరకెక్కిన కాటమరాయుడు ట్రయిలర్ ఎలా ఉంది…?

మొదట్నుంచి ఫ్యాన్స్ ఊహించినట్టే కాటమరాయుడు ట్రయిలర్ పక్కా మాస్ ఎలిమెంట్స్ లో లాంచ్  అయింది. “నన్ను రెచ్చగొట్టకండ్రా..”  అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రయిలర్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇన్నాళ్లు యంగ్ హీరోగా అందర్నీ అలరించిన పవన్, ఈ సినిమాలో మిడిల్ ఏజ్ వ్యక్తిగా కనిపించాడు. మరీ ముఖ్యంగా నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా చాలా హుందాగా ఉంది పవన్ లుక్.

పవన్ హుందాను ఆ మీసం, పంచెకట్టు మరింత ఎలివేట్ చేశాయి. వీటికి తోడు పవన్ మేనరిజమ్స్ కూడా అదుర్స్ అనిపిస్తున్నాయి. పవన్ ను మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపిస్తూనే సినిమాలో మిగతా పాత్రల్ని కూడా ట్రయిలర్ లో పరిచయం చేశారు. రావు రమేశ్ కు మరోసారి కీలకమైన పాత్ర దక్కింది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈనెల 24న కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.