'రాయుడు' హంగామా.....

Saturday,February 04,2017 - 05:16 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వం లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ టీజర్ సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. మెగా ఫాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా టీజర్ ను తాజాగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్.

katamarayudu

 

అనూప్ ఆర్.ఆర్ తో యాక్షన్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయిన ఈ పవర్ ఫుల్ యాక్షన్  టీజర్ ప్రెజెంట్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా టీజర్ లో ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు… ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవన్ చెప్పిన  పవర్ ఫుల్ డైలాగ్ సినిమా స్టామినాను తెలియజేస్తూ ఈ పవర్ ఫుల్ టీజర్ తో మెగా ఫాన్స్ లో ఖుషి నింపింది.