కాటమరాయుడు టీజర్ రిలీజ్ డేట్

Thursday,February 02,2017 - 08:07 by Z_CLU

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ న్యూస్ ఇలా బయటకొచ్చిందో లేదో అప్పుడే ఇది ట్రెండింగ్ అయిపోయింది. డాలీ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా సాగుతోంది. సో… అనుకున్న పనులన్నీ ముందే పూర్తవ్వడంతో… కుదిరితే సినిమాను కాస్త ముందుగానే థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో కూడా టీం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

katamarayudu-pawan-zee-cinemalu-1

నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేేశాడు. ప్రస్తుతం రీరికార్డింగ్ మోడ్ లో ఉన్నాడు. తన కెరీర్ లోనే కాటమరాయుడు ఆల్బమ్ ది బెస్ట్ అంటున్నాడు అనూప్. మరోవైపు రాయలసీమ యాసలో పవర్ స్టార్ చెప్పే డైలాగులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.