యూట్యూబ్ ని రూల్ చేస్తున్న కాటమరాయుడు

Tuesday,February 07,2017 - 04:19 by Z_CLU

డిమాండ్ ఉన్న మాత్రమే వాస్తవమే… హై ఎండ్ హైప్ క్రియేట్ అయిన మాట కూడా నిజమే. కానీ ఫ్యాన్స్ నుండి మరీ ఈ రేంజ్ రియాక్షన్ ఫిలిం మేకర్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. గంటగంటకి సంఖ్య మార్చుకుంటున్న యూ ట్యూబ్ వ్యూస్, కాటమ రాయుడు కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో చెప్పకనే చెప్తున్నాయి.

ఫిబ్రవరి 4 న రిలీజైన టీజర్ ఇప్పటికీ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. కేవలం మొదటి రెండు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని రికార్డ్ చేసుకున్న టీజర్, 5.5 గంటల్లో 2 మిలియన్ వ్యూస్, 24 గంటల్లో 3 మిలియన్ వ్యూస్, 36 గంటల్లో 4 మిలియన్ వ్యూస్, 57 గంటల్లో ఏకంగా 5 మిలియన్ వ్యూస్ ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెద్ద రికార్డ్ నే క్రియేట్ చేసింది.

టీజర్ రిలీజయిన కాసేపటికే రూల్ చేయడం మొదలుపెట్టిన కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర కూడా రాయుడో అనిపించుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ రాయుడి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.