కాటమరాయుడు రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,January 13,2017 - 04:27 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వినూత్న రీతిలో చేసిన ‘కాటమరాయుడు’ ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సంక్రాంతి కానుకగా మరికొన్ని ప్రచార చిత్రాలని విడుదల చేస్తున్నారు. చిత్రం మొదటి టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

katamarayudu-still

సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకదాటిగా జరగబోయే షెడ్యూల్ తో చిత్రం పూర్తవుతుంది. సినిమా 2017 మార్చి 29న ‘ఉగాది’ కి విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.