ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రెడీ....

Monday,March 13,2017 - 04:04 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ గా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.. అనూప్ రూబెన్స్ అందించిన మూడు పాటలను లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన యూనిట్ త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రెడీ అవుతున్నారు..

లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూడు పాటల కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్… మెగా అభిమానుల భారీ గా తరలి రానున్న ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే  పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం…