హై ఎండ్ డిమాండ్ లో కాటమరాయుడు

Monday,February 06,2017 - 02:07 by Z_CLU

పవర్ స్టార్ కాటమరాయుడు సూపర్ ఫాస్ట్ పేజ్ లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కరియర్ లోనే సరికొత్త గెటప్ తో, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ బిగినింగ్ నుండే భారీగా ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, పవర్ ఫ్యాన్స్ లో ఈ సినిమాకి ఏ రేంజ్ డిమాండ్ క్రియేట్ అయిందో తెలుస్తుంది.

టీజర్ రిలీజైన మూడు గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన కాటమరాయుడు టీజర్, 24 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ట్విట్టర్ లో ట్రెండింగ్ వీడియోస్ కి క్వాలిఫై అయిపోయింది.

katamarayudu-zee-cinemalu

 

కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రైట్ టైం చూసుకుని ఆడియో ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది.