కాటమరాయుడు అప్ డేట్స్

Monday,January 16,2017 - 10:15 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాను క్లయిమాక్స్ కు తీసుకొచ్చాడు. ఈరోజు నుంచి కాటమరాయుడు సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ తో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా… టీజర్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నారు.

పవన్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు డాలీ డైరక్టర్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేయాలని అనుకుంటున్నారు.