50 కోట్ల క్లబ్ లోకి కాటమరాయుడు

Thursday,March 30,2017 - 02:26 by Z_CLU

ఉగాది సంబరాలు కాటమరాయుడిని ఈజీగా 50 కోట్ల క్లబ్ కి క్వాలిఫై చేసేశాయి. నిన్న ఒక్కరోజే 4.5 కోట్ల షేర్  వసూలు చేసిన ఈ సినిమా గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల క్యాటగిరీలోకి చేరిపోయింది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యగా నటించిన పవన్ కళ్యాణ్, ఈ సినిమాలో మ్యాగ్జిమం అన్ని క్యాటగిరీస్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ని ప్లాన్ చేసుకోవడం, సినిమా సక్సెస్ కి మేజర్ రీజన్ గా నిలిచింది. కరియర్ లోనే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ పంచె కట్టులో ఎట్రాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, జస్ట్ యూత్ నే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

కాటమరాయుడికి శృతి హాసన్ ఓ మెయిన్ ఎట్రాక్షన్ అయితే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మరో పెద్ద ఎసెట్ గా ప్రూఫ్ అయింది. ఫ్యాక్షన్  బ్యాక్ డ్రాప్ సినిమానే అయినా ఫన్ ఎలిమెంట్స్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ఫిలిం మేకర్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి ట్రీట్ ని జెనెరేట్ చేయడం లో సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో బాక్సాఫీస్ దగ్గర అదే స్ట్రెంత్ తో ప్రదర్శించబడుతున్న కాటమరాయుడు ఇంకా ఎన్ని వసూళ్లు బ్యాగ్ లో వేసుకుంటుందో చూడాలి.