మొదటి సాంగ్ తో హల్చల్...

Saturday,March 04,2017 - 03:14 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ మొదటి సాంగ్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ఫాన్స్ ను ఖుషి చేస్తుంది.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ‘మిరా మిరా మీసం’ అనే టైటిల్ సాంగ్ ను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..


రామజోగయ్య శాస్త్రి పవర్ ఫుల్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ యూట్యూబ్ లో కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసేసి 2 మిలియన్ వ్యూస్ వైపు పరిగెడుతూ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది…అంతే కాక ఇప్పటి వరకూ ఈ సాంగ్ 1 లక్ష 46 వేలకు పైగా లైక్స్ సొంతం చేసుకోవడం మరో విశేషం.. ప్రెజెంట్ మొదటి సాంగ్ తో హల్చల్ చేస్తున్న కాటమరాయుడు మార్చ్ 6న మరో సాంగ్ తో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు…