కాటమరాయుని మిర మిర మీసం సాంగ్

Friday,March 03,2017 - 11:40 by Z_CLU

కాటమరాయుడు హవా బిగిన్ అయింది. నిన్నమొన్నటి వరకు జస్ట్ పోస్టర్స్, ఆన్ లొకేషన్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేసిన కాటమరాయుడు, ఇప్పుడు ఆన్ లైన్ లో సింగిల్స్ తో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. కాటమరాయుడు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిర మిర మీసం సాంగ్’ మరికొద్ది గంటల్లో సోషల్ మీడియాని రూల్ చేయబోతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సింగిల్ ని యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.  కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

సింగిల్స్ రిలీజ్ లో మెగా కాంపౌండ్ సంప్రదాయాన్ని ఫాలో అయిన పవన్… ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. ఈనెల 18న కాటమరాయుడు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాడు. పనిలోపనిగా సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 24న కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

మార్చి 4 నుండి యూరోప్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో పవన్-శృతిహాసన్ తో 2 సాంగ్స్ పిక్చరైజ్ చేస్తారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.