'కాటమరాయుడు' ఎంట్రీ...

Monday,September 26,2016 - 05:28 by Z_CLU

 ఇటీవలే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో థియేటర్స్ లో హంగామా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా విడుదల తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో రాజకీయాలపై దృష్టి పెట్టడం తో తమ అభిమాన హీరో… ఎప్పుడెప్పుడు కొత్త మూవీ ప్రారంభిస్తాడా? నెక్స్ట్ సినిమా షూటింగ్ కు ఎప్పటినుంచి హాజరవుతాడా? అని నిన్నటివరకూ ఎదురుచూసిన పవర్ ఫాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

pawan-kalyan-katamarayudu-sets

    డాలీ దర్శకత్వం లో పవన్ నటించనున్న ‘కాటమరాయుడు’ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకూ కొందరు నటీ నటుల మధ్య సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్ లో పాల్గొనడంతో ఇక అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. మనవాడు వచ్చాడు.. జరుగు.. జరుగు.. మెరుపల్లే వచ్చాడు.. జరుగు.. జరుగు.. అంటూ తమ అభిమాన హీరో సాంగ్ గుర్తుచేసుకుంటూ సంబరపడిపోతున్నారు.