కాటమరాయుడు సెన్సార్ డేట్ లాక్

Sunday,March 12,2017 - 04:30 by Z_CLU

కాటమరాయుడు సినిమా అనుకున్న సమయానికంటే ముందే సిద్ధమైపోతోంది. అందుకే ఈ సినిమాను ఈనెల 15నే సెన్సార్ బోర్డ్ కు పంపించబోతున్నారు. సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ మోడ్ లో ఉంది. ఇటలీలో ఈ సినిమాకు సంబంధించి ఓ పాట చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ కూడా పూర్తవ్వడంతో ఇప్పుడు సెన్సార్ కు రెడీ అవుతున్నారు.

నిజానికి సకాలంలో షూటింగ్ పూర్తవుతుందా లేదా అనుమానం యూనిట్ లో కూడా ఉంది. ఏవైనా అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైతే విడుదల తేదీని మార్చాల్సి ఉంటుందని ముందుగానే 24, 29 తేదీల్ని లాక్ చేసి ఉంచారు. అయితే ఫారిన్ షెడ్యూల్ సాఫీగా ముగియడంతో… 24వ తేదీనే థియేటర్లలోకి రావాలని నిర్ణయించారు. ఈ మేరకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహించాడు. మరోవైపు ఈ సినిమా పాటల్ని యూట్యూబ్ లో దశలవారీగా విడుదల చేస్తున్నారు. ఈనెల 18న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టి, 24న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత.