'కాష్మోరా' ఫస్ట్ లుక్ విడుదల

Thursday,August 18,2016 - 11:04 by Z_CLU

కార్తీ, నయనతార, శ్రీ దివ్య కలిసి నటిస్తున్న చిత్రం ‘కాష్మోరా’.  డ్రీం వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రభు నిర్మాణం లో గోకుల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో సరి కొత్త లుక్ లో భయంకరంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు కార్తీ. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 28 న విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రం కార్తీ కెరీర్ లో ది బెస్ట్ మూవీ కానుందని  చెన్నై టాక్ .  తమిళ్ తో పాటు తెలుగు లోనూ  ఒకే రోజు ఇదే టైటిల్ తో విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొంటున్నాయి..