కారులో షికారుకెళితే టీజర్ లాంచ్ 

Tuesday,August 23,2016 - 04:48 by Z_CLU

 

శ్రీ హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు ,అనీష్ ,అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”కారులో షికారుకెళితే ” . ఈ చిత్ర ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టీజర్ లాంచ్ కార్యక్రమం  ఇటీవలే  జరిగింది . ఈ కార్యక్రమంలో మాదాల రవి  ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ లను లాంచ్ చేయగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ టీజర్ ని లాంచ్ చేసారు .
ఈ సందర్భంగా నటుడు ,నిర్మాత మాదాల రవి మాట్లాడుతూ ” సినిమాలు నిర్మించడం తేలికేనని అయితే వాటిని రిలీజ్ చేయడం సరిగ్గా ప్రమోట్ చేయడం కష్టంగా మారిందని ,ఇటీవల రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన చిన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయని కానీ అవన్నీ కూడా అగ్ర నిర్మాతలు తీసిన చిన్న చిత్రాలు సాధించిన విజయాలని ఎందుకంటే ప్రాపర్ గా పబ్లిసిటీ చేయకపోతే అవి జనాలకు చేరవు ,సరైన పబ్లిసిటీ తో పాటు మంచి థియేటర్ లు కూడా ముఖ్యమని దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు కి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ సినిమాకి కూడా సరైన పబ్లిసిటీ చేయాలనీ సక్సెస్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు .
టీజర్ లాంచ్ చేసిన బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ” టీజర్ బాగుంది , చిన్న చిత్రాలు హిట్ అవుతున్నాయి తప్పకుండా ఈ కారులో షికారుకెళితే ” కూడా మంచి హిట్ కావాలని అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు మీనాక్షి భుజంగ్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తీ , ఆల్రెడీ ఇతని చేత రెండు పాటలు నా సినిమా కోసం కొనుక్కున్నాను  అవి చాలా బాగున్నాయి అంటూ టీం కు శుభాకాంక్షలు అందజేశాడు .
చిత్ర దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ ” నా మిత్రుల సహకారంతో ఈ చిత్రం తెరకెక్కింది . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక వచ్చే నెలలో ఉంటుందని అలాగే త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేస్తామని మీ అందరి సహకారం కావాలని అన్నారు .
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో దీరు మహేష్ ,హీరోయిన్ లు ప్రియా , ఇషికా సింగ్ , మలినేని లక్ష్మయ్య చౌదరి , సంగీత దర్శకులు మీనాక్షి భుజంగ్ , ఎడిటర్ ఆనంద్ , కెమెరామెన్ చంద్రశేఖర్ వేమూరి తదితరులు పాల్గొన్నారు .