Raja Vikramarka - కార్తికేయ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,October 20,2021 - 02:49 by Z_CLU

Kartikeya’s ‘Raja Vikramarka’ to release in Theatres on November 12th

తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్ఐఏ ఏజెంట్‌ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపించబోతున్నాడు. ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. కార్తికేయ కెరీర్‌లో బెస్ట్ లుక్‌ అని చెప్పొచ్చు. స్క్రీన్‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి ఒక్క షాట్ కోసం ప‌ర్టిక్యుల‌ర్ లొకేష‌న్‌కు వెళ్లి, పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

రోల్స్ క్యారెక్టరైజేషన్‌తో పాటు వాళ్ళు ఉపయోగించే వెహికల్స్, గన్స్ దగ్గర్నుంచి ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకొని ఈ సినిమా తీశారు.

Kartikeya Tanya Ravichandran raja vikramarka movie

కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics