కార్తికేయ '90 ఎంఎల్' అప్ డేట్స్

Thursday,May 16,2019 - 01:20 by Z_CLU

‘ఆర్ఎక్స్ 100′ ఫేం కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న ’90ఎంఎల్’ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఇటీవలే జరిగిన రెండు షెడ్యుల్స్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి ‘గుణ 369’ సినిమా బ్యాలెన్స్ షూట్ ఫినిష్ పనిలో బిజీగా ఉన్నాడు కార్తికేయ.

ఆ సినిమా టోటల్ షూట్ పూర్తయిన వెంటనే మళ్ళీ ’90ఎంఎల్’ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు. యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కార్తికేయ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్. ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సినిమా కొలిక్కి వచ్చాక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.