హీరోగా రెండు.. విలన్ గా ఒకటి

Wednesday,May 15,2019 - 10:02 by Z_CLU

‘ఆర్ఎక్స్ 100’ తో హీరోగా పరిచయమైన కార్తికేయ వరుస ఆఫర్స్ అందుకుంటాడని అందరూ ఊహించారు. ఊహించినట్లే హీరోగా రెండు సినిమాల ఆఫర్స్ పట్టేసాడు.  కానీ ఎవరూ ఊహించని విధంగా విలన్ అవతారమెత్తాడు. నాని హీరోగా వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాతో పాటు హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. అదే ‘గుణ 369’.

ఈ రెండు సినిమాలతో పాటు ‘హిప్పీ’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.  ‘గుణ 369’ ని మరో రెండు నెలల్లో థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాంగ్ లీడర్ కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

ఇలా ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ యంగ్ హీరో.