కార్తికేయ ఇంటర్వ్యూ
Wednesday,November 15,2017 - 12:45 by Z_CLU
రిషి డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ ‘ప్రేమతో మీ కార్తీక్’ ఈ నెల 17 న రిలీజ్ అవుతుంది. సాంగ్స్ తో పాటు లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ తో టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు హీరో కార్తికేయ… ఆ చిట్ చాట్ మీకోసం…
స్టోరీలైన్ అదే…
ఫారిన్ లో ఎలాంటి ఇమోషన్స్ లేకుండా, ప్రాక్టికల్ గా డబ్బు, బిజినెసే అన్ని అనుకునే ఒక అబ్బాయి లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చాక ఏం జరిగింది..? తనలో మార్పు కోరుకున్న తండ్రికి తానేం గిఫ్ట్ చేశాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
గొల్లపూడి గారితో పెద్దగా పనిచేయలేదు…
గొల్లపూడి గారు స్క్రీన్ పై ఎక్కువ సేపు కనిపించరు. మా ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ లేవు. కానీ ఆయన సెట్స్ పై ఉన్నంత సేపు ఆయనతో చాలా టైమ్ స్పెండ్ చేశాను. ఆయన ఈ సినిమాకి పని చేయడం నిజంగా అదృష్టం… ఆయన చేసింది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్..
అదే కీ పాయింట్…
ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనం ఏం కోల్పోతున్నాం… ఫ్యామిలీ వ్యాల్యూస్ కి ఎలా దూరమవుతున్నాం లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది…
రిషిగారు ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేశారు…
డైరెక్టర్ రిషి గారికి ఇది ఫస్ట్ సినిమానే అయినా, ఆయన గతంలో సీనియర్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఉండటంతో ప్రతి డివిజన్ ని చాలా ఇంటెలిజెంట్ గా హ్యాండిల్ చేశారు… ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే చిన్న కాన్సెప్ట్ తో సరిపెట్టుకోకుండా, హై ఎండ్ ఇమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేశారు…
మ్యూజిక్ పెద్ద ఎసెట్ అయింది...
షాన్ రెహ్మాన్ గారు సినిమాకి పెద్ద ప్లస్. ఈ రోజు మా సినిమా గురించి అక్కడక్కడా మాట్లాడుకుంటున్నారు.. కొద్దో గొప్పో బజ్ క్రియేట్ అయింది అంటే అది ఆయన మ్యూజిక్ వల్లే… సాంగ్స్ చాలా బాగా వచ్చాయి ఈ సినిమాలో…
చాలా షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో…
ఫస్ట్ సినిమాలోనే ఇన్ని రకాల షేడ్స్, ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయడం నిజంగా లక్ అనే చెప్పాలి. బిగినింగ్ ఇమోషన్ లెస్ NRI లా, అమెరికన్ ఆక్సెంట్ లో మాటలాడటం, బాడీ లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టుగా మార్చుకోవడం… సినిమా అమూవ్ అవుతున్న కొద్దీ చిన్నచిన్నగా క్యారెక్టరైజేషన్ ట్రాన్స్ ఫామ్ అవ్వడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్..
హీరోయిన్ చాలా బాగా చేసింది…
సిమ్రత్ కౌర్ కి ఈ సినిమా కన్నా ముందు అసలు సినిమా చేసే ఆలోచన కూడా లేదు. తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోస్ చూసి, ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాం. కానీ ఫస్ట్ మూవీ అనిపించకుండా చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేసింది..
అందరూ చూడదగ్గ సినిమా…
ప్రేమతో మీ కార్తీక్ అందరూ తప్పకుండా చూడదగ్గ సినిమా… అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాను…