'కార్తికేయ 2' క్యారెక్టర్స్ ఇవే

Saturday,June 11,2022 - 04:41 by Z_CLU

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కార్తికేయ‌ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్  మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. “సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం” అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ మోషన్ పోస్టర్ పై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ‌ 2పై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయ గా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. వీళ్ళ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2.

 పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.