Kapatadhaari - ట్రయిలర్ రివ్యూ

Wednesday,January 13,2021 - 04:03 by Z_CLU

సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి డైరక్షన్ లో రూపొందుతోన్న థ్రిల్లర్‌ `క‌ప‌ట‌ధారి`. `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ను చూస్తే..
“మెట్రో లైన్‌ తవ్వకాల్లో కొన్ని అస్థిపంజరాలు బయటపడ్డాయి.. ఈ శవాలను పాతిపెట్టి ఎంత కాలం అయ్యుంటుంది..!
ట్రాఫిక్‌ ఎస్సైవా.. అదొక క్లోజ్డ్‌ కేస్‌
చనిపోయిన వ్యక్తి పేరు సంపత్‌ రాజ్‌.. దీన్ని బట్టి చూస్తే స్టేట్మెంట్‌ ఇచ్చిన వారిలో ఎవరో ఒకరు అబద్దం చెప్పారు.
క్రైమ్‌ అయినా ట్రాఫిక్‌ అయినా పోలీస్‌ పోలీసే.. “

ఇలాంటి డైలాగ్స్‌తో పాటు ఆసక్తిరేపే సన్నివేశాలతో కపటధారి ట్రైలర్‌ ఉంది. కొంతకాలం క్రితం జరిగిన హత్యలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరుకుతాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న ఓ ట్రాఫిక్ పోలీస్‌ ఎలా ఛేదిస్తాడు. ఈ కేసును సాల్వ్‌ చేసే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని కథానాయకుడు ఎలా అధిగమించాడు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.