‘మణికర్ణిక’ కాంట్రవర్సీ పై స్పందించిన కంగనా రనౌత్

Friday,February 09,2018 - 03:27 by Z_CLU

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది మణికర్ణిక. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి లక్ష్మీ బాయ్ గా కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయంతో రాజస్థాన్ లోని సర్వ బ్రాహ్మణ మహాసభ ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నిన్న బికనీర్ లోని కర్ణిక టెంపుల్ ని దర్శించుకున్న కంగనా రనౌత్, జోథ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న కాంట్రవర్సీ పై క్లారిటీ ఇచ్చింది.

“మణికర్ణిక సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏ మాత్రం లేవు. కొంతమంది కావాలని ఈ సినిమా చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నారు. దేశ స్వతంత్రం  కోసం పోరాడి బ్రిటీష్ ని గడగడలాడించిన వీరవనిత విషయంలో ఇలాంటి వివాదాలు సృష్టించడం మూర్ఖత్వం. మణికర్ణిక దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది’ అని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కమాల్ జైన్ నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథనందించిన ‘మణికర్ణిక’ కు శంకర్ మహదేవన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.