సొంత బయోపిక్ అనుకునేలోపు ఇలా జరిగింది

Saturday,March 23,2019 - 12:33 by Z_CLU

జస్ట్ బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనూ కంగనా రనౌత్ అంటే చిన్న సైజు సెన్సేషనే. రీసెంట్ గా మణికర్ణిక’ సినిమాతో కంగనా రనౌత్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేస్తుందనిపించుకుంది. అయితే ఆ తరవాతే కంగనా రనౌత్ సొంత లైఫ్ స్టోరీతో, అదే సొంత బయోపిక్ లో నటించబోతుందనే న్యూస్ గట్టిగానే చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడా బయోపిక్ ప్లేస్ లో జయలలిత బయోపిక్ వచ్చి చేరింది. ఇది కూడా పక్కా అఫీషియల్.

తమిళనాట తరతరాలకు తన మార్క్ నిలిచిపోయేంతలా అటు సినీ రంగంలోను, ఇటు రాజకీయ రంగం లోను తన మార్క్ రిజిస్టర్ చేసుకున్న జయలలిత బయోపిక్ లో నటించనుంది కంగనా రనౌత్. దర్శకుడు A.L. విజయ్ ఈ సినిమాకి సంబంధించిన రీసర్చ్ దగ్గరి నుండి, స్క్రిప్ట్ వర్క్ వరకు, ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ R. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి సొంత బయోపిక్ తరవాత కంగనా రనౌత్ ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా..? లేకపోతే సైమల్టేనియస్ గా రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తుందా అనేది చూడాలి.