మణికర్ణిక ట్రైలర్ రిలీజయింది

Tuesday,December 18,2018 - 03:11 by Z_CLU

జనవరి 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘మణికర్ణిక’. క్రిష్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజయింది. కంగనా రనౌత్, రాణి లక్ష్మీబాయ్ గా కనిపించనున్న ఈ హిస్టారికల్ ఎంటర్ టైనర్ పై మరిన్ని అంచనాలను పెంచుతుంది ఈ ట్రైలర్.

రాణి లక్ష్మీ బాయ్ కథ అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ లో కూడా ఆ కథనే కన్వే చేశారు మేకర్స్. కాకపోతే ఈ ట్రైలర్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ గ్రాండియర్ విజువల్స్, కంగనా రనౌత్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్. సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంది కంగనా రనౌత్. ఆ పర్ఫెక్షన్ ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

 ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది స్పెషల్ మూవీగా నిలవనుంది మణికర్ణిక, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమాకి ఆడియెన్స్ లో ఏ  రేంజ్ డిమాండ్  క్రియేట్  అయి ఉందో  క్లియర్ గా తెలుస్తుంది.   శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. జీ స్టూడియోస్, కమాల్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.