మరోసారి ట్రెండింగ్ గా మారిన కందిరీగ

Wednesday,August 12,2020 - 01:47 by Z_CLU

హీరో రామ్ కు ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు ఎందుకొచ్చింది..?
నిజంగా రామ్ లో అంత ఎనర్జీ ఉందా..?
ఇలాంటి క్వశ్చన్స్ కు ఆన్సర్స్ చెప్పనక్కర్లేదు. జస్ట్ కందిరీగ సినిమాను చూపిస్తే చాలు. రామ్ ఎనర్జీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. Ram Pothineni కెరీర్ లోనే వన్ ఆఫ్ ది మెమొరబుల్ హిట్ గా నిలిచిన కందిరీగ సినిమా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ టాపిక్ అయింది. దీనికి కారణం ఇవాళ్టితో (ఆగస్ట్ 12) ఈ సినిమా రిలీజై 9 ఏళ్లు పూర్తిచేసుకుంది.

నిజానికి ఇది రామ్ చేయాల్సిన సినిమా కాదు. రవితేజ హీరోగా ముందుగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. హీరోయిన్ గా తమన్నను కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. ఆఖరి నిమిషంలో కథతో పాటు కాస్టింగ్ లో కూడా మార్పుచేర్పులు జరిగాయి. అలా సీన్ లోకి ఎంటరైన రామ్.. శీను క్యారెక్టర్ తో చెలరేగిపోయాడు. ఆడియన్స్ కు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. కెరీర్ లో రామ్ ఎన్ని సినిమాలు చేసినా.. అతడి ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే.. రామ్ కు కందిరీగ వెరీ వెరీ స్పెషల్.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో హన్సిక మరోసారి తన గ్లామర్ పవర్ చూపించింది. పాటల్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక తెలంగాణ పిల్ల పాత్ర పోషించిన అక్ష.. తన కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ పట్టేసింది. అటు సోనూ సూద్ కూడా విలనీలో కామెడీ పండిస్తూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో సోనూ సూద్ కామెడీ పండించిన తీరు అందరికీ నచ్చింది.

ఇవన్నీ ఒకెత్తయితే తమన్ సంగీతం మరో ఎత్తు. ఈ సినిమాకు మంచి ట్యూన్స్ ఇవ్వడంతో పాటు అదిరిపోయే బీజీఎంతో సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. దర్శకుడిగా శ్రీనివాస్ ఈ సినిమా ఓవర్ నైట్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ కాస్తా ఏకంగా కందిరీగ శ్రీనివాస్ అయిపోయాడు.

రొమాంటిక్ యాక్షన్ కామెడీగా తెరకెక్కిన Kandireega సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించాడు.