దుమ్ముదులిపిన కాంచన-3.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,April 22,2019 - 12:10 by Z_CLU

మాస్ ఆడియన్స్ లో కాంచన సిరీస్ కు ఉన్న క్రేజ్ మరోసారి తెలిసొచ్చింది. కాంచన-3 సూపర్ డూపర్ హిట్ అయింది. ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసిన ఈ సినిమా, జెర్సీతో సమానంగా కలెక్షన్లు సాధించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో కాంచన-3, జెర్సీ మధ్య పోటాపోటీ నడుస్తోంది.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 3 రోజుల్లో ఏకంగా 9 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ సాధించింది. హారర్ ఎలిమెంట్స్ కు తోడు ఫస్టాఫ్ లో కామెడీ క్లిక్ అవ్వడంతో లారెన్స్ సినిమా వసూళ్లలో దుమ్ముదులుపుతోంది. సమ్మర్ సీజన్ కూడా దీనికి మరింత ప్లస్ అయింది. అటు ఓవర్సీస్ లో మాత్రం కాంచన-3 కంటే జెర్సీకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 3.05 కోట్లు
సీడెడ్ – రూ. 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.96 కోట్లు
ఈస్ట్ – రూ. 0.75 కోట్లు
వెస్ట్ – రూ. 0.51 కోట్లు
గుంటూరు – రూ. 0.85 కోట్లు
కృష్ణా – రూ. 0.69 కోట్లు
నెల్లూరు – రూ. 0.32 కోట్లు