కాంచన-3 ఫస్ట్ డే కలెక్షన్

Saturday,April 20,2019 - 02:10 by Z_CLU

అన్నీ తానై లారెన్స్ తీసిన కాంచన-3 సినిమా వసూళ్లలో దుమ్ముదులిపింది. స్వీయ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒరియా, వేదిక, నిక్కీ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం హారర్ మూవీగానే కాకుండా, కామెడీ ఎంటర్ టైనర్ గా కూడా తెలుగు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 3 కోట్ల 94 లక్షల రూపాయల షేర్ రావడం విశేషం.

డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే, ఏపీ,నైజాంలో అత్యధికంగా 2.Oకు వసూళ్లు వస్తే, కబాలి, ఐ సినిమాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ 3 సినిమాల తర్వాత మొదటి రోజు అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంచన-3 నిలిచింది. లింగ ఫస్ట్ డే కలెక్షన్ ను కాంచన-3 క్రాస్ చేసింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 1.20 కోట్లు
సీడెడ్ – రూ. 0.83 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.38 కోట్లు
ఈస్ట్ – రూ. 0.42 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.38 కోట్లు
కృష్ణా – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.13 కోట్లు