రూ. 75 కోట్ల క్లబ్ లో చేరిన కాంచన-3

Thursday,April 25,2019 - 01:35 by Z_CLU

అన్నీతానై లారెన్స్ తీసిన కాంచన-3 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విజయం సాధించిన ఈ మూవీ తాజాగా 75 కోట్ల క్లబ్ లోకి చేరింది. అవును.. తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

దాదాపు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు లారెన్స్. డైరక్ట్ చేసి నటించడమే కాకుండా.. ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశాడు. ఒవియా, వేదిక, నిక్కీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బి, సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోంది. అందుకే రేపట్నుంచి ఏపీ, నైజాంలో ఈ సినిమాకు అదనంగా మరో 66 థియేటర్లు కేటాయించారు.

కాంచన-3 సక్సెస్ లారెన్స్ లో మరింత నమ్మకాన్ని పెంచింది. అందుకే మరో సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు. కాంచన సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్న ఈ డైరక్టర్, ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కాంచన-4ను సెట్స్ పైకి తీసుకొస్తానని ప్రకటించాడు.