‘కణం’ క్రెడిట్ పాపకే దక్కుతుంది...

Monday,April 23,2018 - 06:34 by Z_CLU

నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఇమోషనల్ థ్రిల్లర్ ‘కణం’. తల్లీ కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని డిఫెరెంట్ ఆంగిల్ లో హారర్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేస్తున్నాడు  ఈ సినిమాలో దర్శకుడు A.L. విజయ్. అయితే కథ ఎంత అద్భుతంగా కథ కుదిరినా, యాక్టర్స్  ఎంత  కష్టపడి పర్ఫామ్ చేసినా, పాప వెరోనికా సహకరించి ఉండకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చి ఉండేది కాదేమో అంటుంది సాయి పల్లవి.

“ ఈ సినిమాలో మదర్ రోల్ చేయాలి అన్నప్పుడు అసలు చేయగలనా అనే క్వశ్చన్ రేజ్ అయింది. మదర్ లా నటించాలంటే కంపల్సరీగా ఆ ఇమోషన్ ని క్యారీ చేయాలి. అలాంటప్పుడు మనకు అవతలి వాళ్ళు సహకరించకపోతే అలా చేయడం కుదరదు. కానీ ‘కణం’ విషయంలో నేను లక్కీగా ఫీలవుతున్నాను. పాప వెరోనికా ఈ సినిమా చేసినన్నాళ్లు సెట్స్ పై వాళ్ళ అమ్మకన్నా నాతోనే స్పెండ్ చేసేది. నా ఒళ్లో పడుకునేది. నేను తినిపిస్తే తినేది. నన్ను రియల్ మదర్ లా ట్రీట్ చేసేది… అంత చిన్న పాపైనా ఆ రోల్ లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయింది. అందుకే ‘కణం’ ఇంత  అద్భుతంగా తెరకెక్కిందంటే ఆ క్రెడిట్ పాపకే దక్కుతుంది’ అని చెప్పుకుంది సాయి పల్లవి.

ఈ నెల 27 న రిలీజవుతుంది కణం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా డెఫ్ఫినేట్ గా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. C. శామ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.