కమ్మరాజ్యంలో కడప రెడ్లు వస్తున్నారు

Monday,November 11,2019 - 12:13 by Z_CLU

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సినిమా రెడీ చేశాడు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్ని తనదైన స్టయిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఈ సినిమా ట్రయిలర్. దీనికి తోడు తాజాగా విడుదలచేసిన సాంగ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇదే ఊపులో సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు.

ఈనెల 29న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా థియేటర్లలోకి వస్తోంది. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ కథ-మాటలు అందించాడు. ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది అంటున్నాడు ఆర్జీవీ. ఇందులో ఏడు పాటలున్నాయి.

టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి న‌రేష్‌కుమార్‌, శ్రీ‌ధర్ నిర్మాతలు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వివాదాలకు కేంద్రబిందువైన వర్మ, ఈ కొత్త సినిమాతో మరిన్ని వివాదాలు సృష్టించబోతున్నాడు.