మొత్తం రెడీ.. రిలీజ్ చేయడమే ఆలస్యం

Friday,March 02,2018 - 02:44 by Z_CLU

కమల్ హాసన్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ విశ్వరూపం-2 ఎట్టకేలకు పూర్తయింది. ఆర్థిక కారణాల వల్ల కొన్ని రోజులు, షూటింగ్ లో జాప్యం వల్ల ఇంకొన్ని రోజులు, పోస్ట్-ప్రొడక్షన్ లో సమస్యల వల్ల మరికొన్ని రోజులు ఆలస్యమైన ఈ సినిమా.. ఇప్పుడు ఫస్ట్ కాపీతో రెడీ అయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 29న లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. టీజర్ కూడా అక్కడే ఎడిట్ చేశారు. త్వరలోనే ఆ డేట్స్ అన్నింటినీ అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు కమల్.

ప్రస్తుతం ఈ హీరో పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. కాస్త విరామం దొరికిన వెంటనే విశ్వరూపం-2 ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు.