స్లిమ్ గా మారబోతున్న కమల్ హాసన్

Thursday,October 19,2017 - 05:17 by Z_CLU

క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయాల‌నుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆ లోపు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మంచి సోష‌ల్ మెసేజ్ ఉన్న చిత్రం చేయాల‌ని కూడా అనుకున్నారు. అందులో భాగంగా, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియ‌న్ 2` సినిమాను చేయ‌బోతున్న‌ట్లు అధికార‌కంగా ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు కూడా వినిపించాయి. కానీ అలాంటిదేం లేద‌ని యూనిట్ తేల్చేసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉన్నార‌ట‌. అందుకోస‌మ‌ని అమెరికా నుండి ఓ ట్రైనర్‌ను రప్పించుకుని ప్ర‌త్యేక‌మైన డైట్ తీసుకుని వెయిట్ త‌గ్గే ప‌నిలో ఉన్నార‌ట క‌మ‌ల్ హాస‌న్‌. ఈ గ్యాప్ లో విశ్వరూపం-2, శభాష్ నాయుడు సినిమాలు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కమల్.