మరో విశ్వరూపం చూపించబోతున్నాడు

Saturday,July 28,2018 - 10:30 by Z_CLU

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఫ్యాన్స్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ ఈ సినిమాపై ఫిక్సయి  ఉంది. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ ఎలిమెంట్స్ తో  తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 10 న గ్రాండ్ గా రిలీజవుతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. పూజా కుమార్, ఆండ్రియా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా రాహుల్ బోస్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నాడు.

 

 

జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆస్కార్ ఫిల్మ్ ( ప్రై ) లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. కమల హాసన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, అగ్రెసివ్ ప్రమోషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నారు.