కమలహాసన్ ‘విశ్వరూపం2’ సాంగ్స్ రివ్యూ

Friday,August 03,2018 - 01:04 by Z_CLU

కమలహాసన్ విశ్వరూపం 2 ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది సినిమా యూనిట్. గతంలో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘విశ్వరూపం’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా సాంగ్స్ ని బట్టి సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ ఎలిమెంట్స్ కి అంతే స్పేస్ ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాలో ‘జ్ఞాపకం కదిలినదా..?’ అనే సాంగ్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తే, ‘ఆధారమా…అనురాగమా…’ అనే సాంగ్ మదర్ సెంటిమెంట్ సాంగ్ లా తెలుస్తుంది. ఈ సాంగ్ ని స్వయంగా కమలహాసన్ పాడినట్టు తెలుస్తుంది. ఇకపోతే మూడో సాంగ్ ‘జాతి మతముల వికృత వ్యాధికి..” అనే సాంగ్, మరీ డ్యూయట్ అని చెప్పడం కష్టం కానీ, సినిమాలో హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీని ఎలివేట్ సాంగ్ అవుతుంది.

ఈ సినిమాకి కమలహాసన్ దర్శకుడు. కమల హాసన్, చారు హాసన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.