విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,August 24,2017 - 10:32 by Z_CLU

కమల హాసన్ మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ కి రెడీ అవుతుంది. 2013 లో రిలీజై సూపర్ హిట్టయిన విశ్వరూపం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ ‘విశ్వరూపం 2’ సినిమా మేకింగ్ స్పీడ్ అందుకుంది. జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ స్పై థ్రిల్లర్ కమలహాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా త్వరలో ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.