విశ్వరూపం 2 ట్రైలర్ పై NTR ఎఫెక్ట్

Monday,June 11,2018 - 06:15 by Z_CLU

కమలహాసన్ మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వరూపం 2 ట్రైలర్ రిలీజయింది. ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగష్టు 10 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ NTR సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఈ ట్రైలర్ పై  మరింత కాన్సంట్రేషన్ ఫిక్సయింది.

“ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు, కానీ దేశద్రోహం చాలా తప్పు.” ఇది విశ్వరూపం 2 ట్రైలర్ లో కమలహాసన్ చెప్పే డైలాగ్. 1: 40 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో, చూస్తూ ఉండిపోవాలనిపించే రేంజ్  లో ఉన్న యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ అవుతున్నాయి. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది విశ్వరూపం 2. కమల హాసన్ పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్సెస్ తో మెస్మరైజ్ చేయనున్న ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. జిబ్రాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.