కమల హాసన్ రజినీకాంత్ మల్టీస్టారర్

Tuesday,January 24,2017 - 02:14 by Z_CLU

సౌత్ ఇండియన్ సినిమాకి బెగ్గెస్ట్ ఐకాన్స్ కమల హాసన్, రజినీకాంత్ మల్టీస్టారర్ కి రెడీ. ఇదేదో నిన్ననో, మొన్ననో తీసుకున్న డెసిషన్ కాదు, లాంగ్ లాంగ్ బ్యాక్ నుండి అనుకుంటున్నదే, కాకపోతే ఇద్దరినీ ఎఫర్ట్ చేసే ప్రొడ్యూసర్ దొరకకపోవడంతో, సినిమా సెట్స్ పైకి రావడం లేదు. ఈ విషయం స్వయంగా కమలహాసనే క్లారిటీ ఇచ్చాడు.

గతంలో రజినీకాంత్ కమల హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. అఫ్ కోర్స్ ఆ క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. సిల్వర్ స్క్రీన్ పై ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం జంకని ఈ నట దిగ్గజాలు, మంచి ప్రొడ్యూసర్ దొరికితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

ప్రస్తుతం శభాస్ నాయుడు సినిమాతో కమల హాసన్, రోబో 2.0 సినిమాతో రజినీకాంత్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ లోపు ఎవరైనా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఈ ఇద్దరితో సినిమా చేద్దామని డిసైడ్ అయితే, ఈ ఇద్దరి కాంబోలో హై ఎండ్ ఎంటర్ టైనర్ లాంచ్ అవ్వడం మరీ కష్టమేం కాదు.