KalyanRam - ఒకసారి 5 సినిమాలు

Tuesday,July 06,2021 - 10:21 by Z_CLU

రెండు సినిమాలు షూటింగ్ స్టేజిలో మరో మూడు లైనప్ లో ఐదు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు కళ్యాణ్ రామ్. అవును ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ పోస్టర్స్ , ఎనౌన్స్ మెంట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం నందమూరి హీరో చేతిలో ఐదు సినిమాలున్నాయా అంటూ అతని లైనప్ తెలియని వారు షాకవుతున్నారు.

ప్రస్తుతం సొంత బేనర్ లో వశిస్ట్ దర్శకత్వంలో ‘బింబిసార’ అనే టైటిల్ తో భారీ బడ్జెట్ హిస్టారికల్ డ్రామా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో రాజేంద్ర అనే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ స్టేజిలో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరో మూడు సినిమాలు లైన్లో పెట్టి వరుసగా ఎనౌన్స్ మెంట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రయిజ్ చేశాడు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ నెక్స్ట్ దిల్ రాజు నిర్మాణంలో KV గుహన్ డైరెక్షన్ లో క్రైం థ్రిల్లర్ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కళ్యాణ్ రామ్ ,గుహన్ కాంబినేషన్ లో గతంలో 118 అనే డిఫరెంట్ సినిమా వచ్చి సక్సెస్ సాధించింది. అందుకే మళ్ళీ ఈ హిట్ కాంబో మరో సినిమాతో రాబోతుంది. అలాగే అభిషేక్ అగర్వాల్ బేనర్ లో ‘డెవిల్’ అనే సినిమా డిఫరెంట్ సినిమా చేయనున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎనౌన్స్ చేశారు మేకర్స్. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే మహేష్ కోనేరు నిర్మాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో #NKR22 సినిమా ఎనౌన్స్ చేశారు. మిగతా డీటెయిల్స్ త్వరలోనే చెప్పనున్నట్లు తెలిపారు. ఈ సినిమా గుహన్ , నవీన్ మేడారం సినిమాల తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాకు దర్శకుడెవరనేది తెలియాల్సి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics