ఫస్ట్ కలెక్షన్... తర్వాతే యాక్షన్..

Saturday,November 12,2016 - 01:50 by Z_CLU

నందమూరి  హీరో కళ్యాణ్ రామ్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవలే పూరి దర్శకత్వం లో ‘ఇజం’ సినిమా చేసిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతానికి హీరోగా కంటే నిర్మాణంపైనే ఎక్కువ  ఫోకస్ పెట్టాడట. ‘పటాస్’ తో కథానాయకుడిగా సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్  ఆ సినిమాతో నిర్మాతగానూ మంచి వసూళ్లు సాధించాడు. ఈ సినిమా తరువాత రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో నిర్మించిన  ‘కిక్-2’… తాజాగా విడుదలైన ఇజం సినిమాలతో నిర్మాతగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడట కల్యాణ్ రామ్. అందుకే ప్రస్తుతం హీరోగా నటించే సినిమాలను పక్కన పెట్టి మరీ తన తమ్ముడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నిర్మించబోయే సినిమాపైనే పూర్తిగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కల్యాణ్ రామ్. ఇదొక మల్టీస్టారర్ మూవీ. ఈ సినిమా కంటే… తను ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి నిర్మించనున్న సినిమాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడట కల్యాణ్ రామ్. యంగ్ టైగర్ ఎప్పుడు కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడా అని కల్యాణ్ రామ్ కూడా ఎదురుచూస్తున్నాడు.