Bimbisara - బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన కల్యాణ్ రామ్ మూవీ

Monday,August 08,2022 - 04:03 by Z_CLU

KalyanRam dominates Box Office with his Bimbisara Movie

1. బింబిసార: మాస్ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకొని రిలీజైంది. ఆ టార్గెట్ ను అందుకుంది. పైగా, బోనస్‌గా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిన సోషియో ఫాంటసీ ఎలిమెంట్ తో తెరకెక్కడంతో పాటు.. చైల్డ్ సెంటిమెంట్ కూడా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఇలాంటి కథను, కొత్త దర్శకుడ్ని ఎంచుకొని క‌ళ్యాణ్ రామ్ పెద్ద రిస్క్ చేశాడు. అయితే అతడి రిస్క్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఏపీ,నైజాంలోని ప్రతి సెంటర్ లో ఈ సినిమా క్లిక్ అయింది. కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. నిన్న ఆదివారం దాదాపు అన్ని సెంటర్లలో హౌజ్ ఫుల్స్ నడిచాయి.

కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో క్యాథరీన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కొత్త దర్శకుడు వశిశ్ఠ్ మంచి ఓపెనింగ్ అందుకున్నాడు.

sitaramam-release-date-locked-still-zeecinemalu

2. సీతారామం: క్లాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన ఈ సినిమా మాస్ కౌంటర్ల వద్ద తక్కువ వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ కంటెంట్ బాగుంటే క్లాస్-మాస్ తేడా లేదని సీతారామం ప్రూవ్ చేసింది. ఓపెనింగ్స్ ఆకట్టుకోగా, పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ కారణంగా రెండో రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు కూడా అదే ఊపు కనిపించింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హను రాఘవపూడి తన కెరీర్ బెస్ట్ అందించాడు. నిర్మాత అశ్వనీదత్ మరో హిట్ కొట్టారు.

3. విక్రాంత్ రోణ: శాండల్‌వుడ్ నుండి వచ్చిన ఈ సినిమాకు మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా ఫ్లాప్ అన్నారు కూడా. కానీ తక్కువ కొటేషన్ కే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కంటెంట్ వైజ్ యావరేజ్ మార్కులు తెచ్చుకుంది.

కొన్ని సెంటర్లలో మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. మారుమూల గ్రామం నేపథ్యంలో రివెంజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఛైల్డ్ సెంటిమెంట్ ఉంది. సుదీప్ హీరోగా నటించగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఐటెంసాంగ్ చేసింది. వరల్డ్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ.

4. ది బుల్లెట్ ట్రైన్: బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హాలీవుడ్ చిత్రం ఈ వారం సర్ ప్రైజింగ్ హిట్ గా నిలిచింది. యంగ్, టీనేజ్ ప్రేక్షకుల ఆదరణతో మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమాకు స్టడీగా కలెక్షన్లు వస్తున్నాయి. జోయి కింగ్ ఫిమేల్ లీడ్ పోషించగా, డెడ్‌పూల్ 2 ఫేమ్ డేవిడ్ లీచ్ దీనికి దర్శకత్వం వహించారు.

ramarao-on-duty-raviteja

5. రామారావు ఆన్ డ్యూటీ: రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. ఆడియన్స్ ఈ సినిమాను పట్టించుకోలేదు. రిలీజైన మొదటివారమే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రాగా, బింబిసార రాకతో కాస్త అందుకుంటుందేమోననే అశలు కూడా పోయాయి.
శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో శరత్ ఆశించిన స్థాయిలో డెబ్యూ ఇవ్వలేకపోయాడు.